విజయ్ సినిమాలో టాలెంటెడ్ హీరో
ఫ్యామిలీ స్టార్ తో దారుణమైన ఫ్లాప్ ను అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో తన స్పీడు ను పెంచాడు. కెరీర్లో దూసుకెళ్తూ మంచి హిట్లు కొట్టాలని డిసైడైన విజయ్ గ్యాప్ లేకుండా ఒప్పుకున్న మూడు సినిమాలను ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంట్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమాలో విజయ్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షెడ్యూల్ రీసెంట్ గా వైజాగ్ లో జరిగింది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారు. తర్వాత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి అమ్మడు తప్పుకుంది.
శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ భోర్సే, మమిత బైజు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరు ఫైనల్ అయ్యారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని సమాచారం. సత్యదేవ్ ఓ వైపు హీరోగా నటిస్తూనే ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. కథ, తన పాత్ర బాగుంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి వెనుకాడడు సత్యదేవ్. మరి విజయ్ సినిమాలో సత్యదేవ్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో తెలియాల్సి ఉంది.













