ఇక కృష్ణమ్మ మీదే సత్యదేవ్ ఆశలు..?
టాలీవుడ్ లో గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యి, హీరోగా ఎదిగిన వాళ్ళల్లో సత్యదేవ్ ఒకరు. రీసెంట్ గా “గుర్తుందా శీతాకాలం” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటె సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఒక్కసారి లక్ మన తలుపు తడితే చాలు, ఇంకెవరు ఆపలేరు. సత్యదేవ్ విషయంలో ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది.
సత్యదేవ్ లో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ కి తగ్గట్టే హీరోగా చాల అవకాశాలు తలుపు తడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇతడి టాలెంట్ ని గుర్తించి గాడ్ ఫాదర్ చిత్రం లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన సత్యదేవ్ కి మంచి పేరు , ప్రశంసలైతే వచ్చాయి కానీ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు.
ప్రస్తుతం హీరోగా చేసిన సినిమా అయినా సక్సెస్ అవుతుందని ఆశ పడితే అది కూడా జరగలేదు. మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ చిత్రాన్ని కన్నడ లవ్ మోక్టైల్ సినిమా రీమేక్ గా డైరెక్టర్ నాగ శేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇలాంటి కథలు తెలుగులో “ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్” సినిమాల రూపంలో వచ్చాయి.
తెలిసిన కథనే , చూసిన జోనర్ నే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడంతో సత్యదేవ్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో గుర్తుందా శీతాకాలం సత్యదేవ్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పటికే చూసిన కథే అవ్వడంతో తమన్నా, మూవీ టీం తో కలిసి ఎన్ని ప్రొమోషన్స్ చేసినా లాభం లేకుండా పోయింది. ఆఖరికి ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
దీంతో సత్యదేవ్ ఫైనల్ గా కొరటాల శివ సమర్పణలో తెరకెక్కిన `కృష్ణమ్మ`పైనే ఆశలు పెట్టుకున్నాడు. రఫ్ అండ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సత్యదేవ్ నటించిన ఈ మూవీ విజయవాడ నేపథ్యంలో సాగనుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీతో అయినా సత్యదేవ్ కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకుని హీరోగా సరికొత్త ట్రాక్ లోకి చేరి కొత్త ఇమేజ్ ని దక్కించుకుంటాడా? అన్నది వేచి చూడాల్సిందే.













