Bellamkonda Ganesh: రెండేళ్లకు రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్?
బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) కొడుకులిద్దరూ టాలీవుడ్ లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్(Sai Sreenivas) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. చేతిలో సినిమాలైతే ఉన్నాయి కానీ ఇంకా శ్రీనివాస్ కెరీర్ కు సరైన సక్సెస్ దక్కలేదు. కానీ అవకాశాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. తనకు ఇప్పటికే వచ్చిన ఇమేజ్‌తో కొత్త అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
సురేష్ చిన్న కొడుకు గణేష్(Bellamkonda Ganesh) కూడా స్వాతిముత్యం(Swathimuthyam) అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి మార్కులందుకున్నాడు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న వరుస సినిమాలు చేయడం లేదు. స్వాతిముత్యం వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు తన తర్వాతి సినిమా ఏంటన్నది అనౌన్స్ చేసింది లేదు.
తాజా సమాచారం ప్రకారం గణేష్ తన తర్వాతి సినిమాను సతీష్ రెడ్డి మల్లిడి(Satish Reddy Mallidi) అనే కొత్త డైరెక్టర్ తో లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ భామని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు నిర్మాత ఎవరు? ఏ జానర్ లో ఈ సినిమా రూపొందనుంది? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి కొడుకుల్ని దారిలో పెట్టాలని సురేష్ అయితే బాగానే ట్రై చేస్తున్నాడు.













