ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్ విడుదల..
బాహుబలిలో కట్టప్ప పాత్రలో అద్భుతంగా నటించిన నటుడు సత్యరాజ్.. ఇప్పటి వరకు విలన్‌గా, హీరోగా ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆయన నటించి జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. రీసెంట్గా వచ్చిన ప్రతిరోజు పండగే చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించారు. కాగా సత్యరాజ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం ఎమర్జెన్సీ.. ఈ సినిమా తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ కానుంది. రివెంజ్ తీర్చుకునే తండ్రిపాత్రలో సత్యరాజ్ ఈ సినిమాలో కన్పించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో సత్యరాజ్ మాస్ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని హనీబీ క్రియేషన్స్ పతాకంపై సజీవ్ మీరాసాహెబ్ రాథర్ నిర్మిస్తున్నారు. దర్శకుడు దేరాన్ తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎన్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.













