పునీత్ రాజ్ కుమార్ కు మరో అరుదైన గౌరవం
కన్నడ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-3 శాటిలైట్‌కు శాటిలైట్ పునీత్ అని పేరు పెట్టారు. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించచిన 75 ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని నిర్ణంచుకున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక విద్యార్థులు రూపొందించిన ఈ శాటిలైట్‌ను ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్ష్యలోకి పీఎస్ఎల్వీ`సీ54 వాహననౌక ద్వారా పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.













