మహేష్ ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట’ .పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై సినిమా రూపొందింది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం సమ్మర్ సందర్భంగా విడుదలై నాలుగో వారానికి చేరువైంది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూడలేని ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో రెండు తేదీలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
జూన్ 10 లేదా జూన్ 24.. ఈ రెండు తేదీల్లో ఏదో ఒకరోజున ప్రముఖ డిజిటల్ వేదికైన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందట. విజయవంతంగా ప్రదర్శింపబడుతూ విడుదలైన పన్నెండు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. పోస్ట్ పాండమిక్ తర్వాత విడుదలైన చిత్రాల్లో భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేలా ఓటీటీ సంస్థ ప్రతినిధులు మేకర్స్‌తో చర్చలు జరిపారట. ‘సర్కారు వారి పాట’. ఇండియన్ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర.. బాధ్యతను గుర్తు చేసేలా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్.













