నాని సినిమాకు తప్పని పోటీ
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న పాన్ ఇండియా సినిమా సరిపోదా శనివారం. ఆగస్ట్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అదే వారంలో మరో సినిమా పోటీ లేదు కానీ వారం తిరక్కముందే సెప్టెంబర్ 5న దళపతి విజయ్ గోట్ రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి నాని సినిమాకు పోటీ తప్పేలా లేదు.
గోట్ ముందు చెప్పినట్లు సెప్టెంబర్ 5కి రిలీజ్ కాదనుకున్నారు కానీ ఇప్పుడు సినిమాను చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల మూడో వారంలో ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తుందట గోట్ చిత్ర యూనిట్. విజయ్ సినిమా చెప్పిన టైమ్ కు రావడం వల్ల నానికి ఇబ్బంది తప్పట్లేదు.
సరిపోదా శనివారం తమిళంతో పాటూ ఇతర ప్రధాన భాషల్లో కూడా రిలీజవుతుంది. మంచి టాక్ వస్తే కనీసం రెండు మూడు వారాలైనా మంచి రన్ దక్కుతుంది. అలాంటి పరిస్థితుల్లో విజయ్ గోట్ రిలీజైతే నాని సినిమాకు ఎంత టాక్ ఉన్నా బజ్ తగ్గడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కు మంచి క్రేజే ఉంది. తుపాకీ సినిమా నుంచి వారసుడు వరకు సినిమా సినిమాకీ అతని మార్కెట్ పెరుగుతూనే ఉంది. కాబట్టి నాని సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్పించి విజయ్ సినిమాను తట్టుకోవడం కష్టం. నాని మాత్రం సరిపోదా శనివారంపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు.













