Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ సమ్మర్ రిలీజ్ కి సిద్దం
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకి పేరొందిన శ్రీదేవి మూవీస్(Sridevi Movies) పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి(Mohan Krishan Indraganti) దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్(Sivalenka Krishna Prasad) నిర్మించిన పూర్తి నిడివి హాస్య చిత్రం ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam)వేసవి సెలవుల్లో నవ్వులు పంచడానికి సిద్ధంగా ఉంది.
ప్రియదర్శి, (Priyadarshi and Rupa Koduvayur)రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగా’, ‘సంచారి సంచారీ’ పాటలు ట్రెండ్ అవుతుండగా, టీజర్ లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా విడుదలవ్వనున్న ‘సారంగపాణి జాతకం’ గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… ” వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వెళ్ళి చూసే పరిపూర్ణ హాస్యరస చిత్రం మా ‘సారంగపాణి జాతకం’. మా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేసాం. సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇస్తూనే ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. ఆద్యంతం కట్టిపడేస్తూనే, వచ్చే ఎండలకి సాంత్వనలా అందరినీ అలరిస్తుందీ సినిమా” అని అన్నారు.













