సారంగదరియా…మరో క్రేజ్ రికార్డు
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జోడిగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం రిలీజ్కు ముందే పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సారంగదరియా సాంగ్ పుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ఇన్స్టంట్ హిట్గా రికార్డు సొంతం చేసుకుంది. సుద్దాల అశోక్ తేజ్ రాసిన ఈ పాటను ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించారు. తాజాగా ఈ పాట యూట్యూబ్లో మరో క్రేజ్ రికార్డు సెట్ చేసుకుంది. ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్లో 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. అతి తక్కువ సమయంలో ఓ లిరికల్ వీడియోకు ఈ విధమైన ఆదరణ లభించటం ఇదే తొలిసారి.













