Sara Ali Khan: ఆ టైమ్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు: సారా అలీఖాన్
జనవరి 16వ తేదీన బాలీవుడ్ సైఫ్ అలీఖాన్(Saif Ali khan) ఇంట్లోకి ఓ దుండగుడు ప్రవేశించి అతనిపై ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎటాక్ లో సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయం అవడంతో ఆయనకు సర్జరీ కూడా చేశారు. అయితే ఈ ఎటాక్ విషయంలో సైఫ్ కూతురు సారా అలీఖాన్(Sara Ali Khan) రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
తన తండ్రికి జరిగిన ప్రమాదం గురించి తెలియగానే తామెంతో కంగారు పడ్డామని చెప్పిన సారా, విషయం తెలియగానే అందరం షాక్ లో ఉన్నామని, ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని తెలిపింది. ఈ విషయంలో తన తండ్రికి ఏమీ జరగకుండా బయటపడినందుకు తాము చాలా అదృష్టవంతులమని చెప్తోంది సారా.
తాము హాస్పిటల్ కు వెళ్లే వరకు నాన్ స్టాప్ గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయని, తండ్రి హెల్త్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారని, అయినా ఆ 15 నిమిషాలు మాకొక జీవితకాలంగా అనిపించిందని సారా తెలిపింది. తన తండ్రి హాస్పిటల్ నుంచి మళ్లీ చిరునవ్వుతో వచ్చేవరకు తన మనసు కుదటపడలేదని, ఇలాంటి విషయాల్లో తాను చాలా సెన్సిటివ్ అని సారా వెల్లడించింది.













