వైభవంగా సంతోషం అవార్డుల ప్రదానం
సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ 2019 ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని సినీ తారల మధ్య వైభవంగా జరిగింది. నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాది తారలు ఆడిపాడి అలరించారు. 65 సంవత్సరాల సినీ జీవితం పూర్తయిన సందర్భంగా నటి జమునకు అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు. అల్లు రామలింగయ్య స్మారక అవార్డును వెన్నెల కిశోర్‌కు, డి.రామానాయుడు స్మారక పురస్కారాన్ని దిల్ రాజ్‌కు, శ్రీదేవి స్మారక అవార్డును శ్రియకు అందజేశారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ (రంగస్థలం) అవార్డును స్వీకరించారు. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాంకీ (ఆర్ఎక్స్ 100), ఉత్తమ నటుడు కార్తీకేయ (ఆర్ఎక్స్ 100), ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అరవింద సమేత వీరరాఘవ), మోస్ట్ వర్సటైల్ లెజండరీ యాక్ట్రెస్ అవార్డును కుట్టి పద్మిని అందుకున్నారు.













