సంతోష్ మీద పెద్ద బాధ్యతే ఉంది
కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కు మంచి పేరుంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 12 ఏళ్లు దాటింది. విపరీతమైన పోటీని తట్టుకుని మరీ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడంటే దానికి కారణం ఆయన ఇచ్చే రీరికార్డింగే. డైరెక్టర్లు సంతోష్ నారాయణన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. అయితే ఇప్పటివరకు ఆయన కెరీర్లో చేసిన జర్నీ ఒకెత్తయితే ఇప్పుడు కల్కి 2898ఏడీ సినిమా కోసం వర్క్ చేయడం మరో ఎత్తు. కల్కిలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఏదో మొక్కుబడిగా రెండు మూడు సాంగ్స్ ను పెట్టారు కానీ నాగ్ అశ్విన్ మెయిన్ ఫోకస్ మొత్తం ఆడియన్స్ కు ఇండియన్ స్క్రీన్ పై గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే.
అందుకే కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి ఏ మాత్రం వెళ్లకుండా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో సినిమాను తెరకెక్కించాడు. నాగ్ అశ్విన్ చెప్పాలనుకుంది ఆడియన్స్ కు సరిగ్గా కనెక్ట్ అవాలంటే దానికి నేపథ్య సంగీతం ఎంతో కీలకం. ఎక్కడా గూస్బంప్స్ కు తగ్గకుండా బీజీఎం ఉండాలి. టాలీవుడ్ లో ఎంతోమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను కాదని నాగ్ అశ్విన్ సంతోష్ నారాయణన్ ను ఎంచుకోవడానికి కారణం ఆయన గొప్ప రీరికార్డింగ్ అందిస్తాడన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని మరి సంతోష్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.













