Sankrantiki Vasthunnam: ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న వెంకీ సినిమా
సంక్రాంతికి ఈసారి గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj), సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో బడ్జెట్ పరంగా చెప్పుకుంటే గేమ్ ఛేంజర్ మొదట నిలవగా, డాకు మహారాజ్ రెండో స్థానంలో ఉంది. ఆఖరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది. బడ్జెట్ పరంగా చివరన ఉన్నప్పటికీ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో మాత్రం ఈ సినిమానే ముందంజలో ఉంది.
సుమారు నెల రోజుల ముందు నుంచే ఈ సినిమా నుంచి రోజూ ఏదొక కంటెంట్ ను ఇస్తూ, సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయింది. ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi), హీరోయిన్లు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), ఐశ్వర్యా రాజేష్(Aiswarya Rajesh) తో పాటూ హీరో వెంకటేష్(Venkatesh) కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
మామూలుగా వెంకీ తన సినిమా ప్రమోషన్స్ లో అంత యాక్టివ్ గా ఏమీ పార్టిసిపేట్ చేయడు. మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవడం అంతే చేస్తాడు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మాత్రం వెంకీ చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ కు హాజరవుతూ, ప్రమోషనల్ వీడియోల్లో సైతం భాగమవుతున్నాడు. పండక్కి పర్ఫెక్ట్ గా సూటయ్యే సినిమా కావడంతో ఆడియన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఎఫ్2(F2), ఎఫ్3(F3) తర్వాత వెంకీ- అనిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సంక్రాంతికి వస్తున్నాంపై హైప్ బాగా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













