Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం- ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్
విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(anil ravipudi) కలయికలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పండక్కు ముందు గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj) పోటీని వెంకీ ఎలా తట్టుకుంటాడో అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను మించి వెంకీ మామ సినిమా గట్టిగా నిలబడింది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.106 కోట్లకు పైగా గ్రాస్ ను దాటి వెంకీ కెరీర్ లోనే ఫస్ట్ రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది.
పోటీ వల్ల వెంకీ సినిమాకు సరిపోయినన్ని స్క్రీన్లు దొరకలేదు. డిమాండ్ కు తగ్గట్టు అప్పటికప్పుడు షోలు పెంచుతున్నారు తప్పించి ముందైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇన్ని స్క్రీన్లు లేవు. ఇప్పటికీ సినిమాకు టికెట్స్ దొరుక్క ఎదురుచూస్తున్న వారి నెంబర్ లక్షల్లోనే ఉంది. మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
చూస్తుంటే మొదటి వారం పూర్తయ్యే లోపే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.200 కోట్లు దాటేయడం ఖాయం లానే అనిపిస్తోంది. ఇప్పటికే చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ లోకి ఎంటరైంది. ఏపీలో టికెట్ రేట్లు ఎక్కువున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం ఈ సినిమాపై చూపించడం లేదు. తిరిగి టికెట్ రేట్లు నార్మల్ అయితే బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సెకండ్ ఇన్నింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.













