Sankranthiki Vasthunnam: వెంకీ సినిమాకి అన్నీ ప్లస్సులే
ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల్లో బడ్జెట్ పరంగా రూపొందిన వాటిలో ఆఖరిగా ఉంది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) సినిమానే. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమాకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ట్రైలర్ మరీ గొప్పగా లేకపోయినా కామెడీ వర్కవుట్ అయ్యేలానే అనిపిస్తోంది. దీంతో మూవీ బయ్యర్లకు సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది.
గ్రౌండ్ లెవెల్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వెంకీ(Venky) సినిమాకే ఓటేస్తారనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎలాగూ గేమ్ ఛేంజర్(Game Changer) కు యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. ఆదివారం రిలీజయ్యే డాకు మహారాజ్(Daku Maharaj) రిజల్ట్ ను బట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎన్ని థియేటర్లు అడ్జస్ట్ చేయాలనే దానిపై డిస్ట్రిబ్యూటర్లు ఓ ప్లాన్ కు వచ్చే అవకాశం ఉంది.
అసలే ఎఫ్2(F2), ఎఫ్3(F3) తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi)- వెంకటేష్(Venkatesh) కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాకు డిఫరెంట్ గా చేస్తున్న ప్రమోషన్స్ కూడా ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతున్నాయి. తక్కువ బడ్జెట్ కాబట్టి ఈ సంక్రాంతి సినిమాల్లో ఎక్కువగా లాభపడేది ఈ సినిమానే. దానికి కారణం థియేట్రికల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ త్వరగా చేరుకునే అవకాశం ఉండటమే. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వెంకీ సినిమాకు థియేటర్లకు పరిగెత్తడం ఖాయం.













