Venkatesh: వెంకీ రికార్డు సృష్టించేలా ఉన్నాడే!
టాలీవుడ్ సీనియర్ హీరోల రికార్డుల్లో చాలా రికార్డులు చిరంజీవి(Chiranjeevi) పేరుపైనే ఉన్నాయి. అప్పట్లోనే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నెం.150(Khaidhi no150) తో రీఎంట్రీ ఇచ్చాక కూడా ఆయన కొత్త రికార్డును నెలకొల్పాడు. సీనియర్ హీరోల్లో ఎవరికీ వీలు పడని రూ.100 కోట్ల షేర్ ను అందుకున్న చిరూ, తర్వాత వాల్తేరు వీరయ్య(waltair Veerayya) సినిమాతో రూ.200 కోట్ల గ్రాస్ ను అందుకున్నాడు.
ఇప్పుడు వెంకటేష్(Venkatesh) ఒకేసారి ఆ రెండు ఘనతలను అందుకునేలా ఉన్నాడు. సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడో రోజుకే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కూడా దాటేస్తుంది.
ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం రూ.100 కోట్ల షేర్ క్లబ్ లోకి జాయినైంది. వెంకీ ఊపు చూస్తుంటే సీనియర్ హీరోల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచేట్టు ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం ఇలానే రన్ అయితే రూ.300 కోట్ల గ్రాస్ ను కూడా ఈజీగా దాటేయగలదు. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి సెకండ్ వీకెండ్ అయ్యే వరకు సంక్రాంతికి వస్తున్నాం మంచి రన్ దక్కించుకోవడం ఖాయం.













