సంక్రాంతి విన్నర్ అయినా, కమర్షియల్ సక్సెస్ కష్టమే
వచ్చే సంక్రాంతికి రెండు కాదు, మూడు కాదు ఏకంగా ఆరు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ వేటికవే స్పెషల్ జానర్లు. దాంతో పాటూ అన్నీ సినిమాలూ మంచి బ్యాకప్ తోనే రిలీజ్ కాబోతున్నాయి. మంచి ప్లానింగ్ తో థియేటర్ అగ్రిమెంట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వచ్చే సంక్రాంతికి రానున్న సినిమాల్లో గుంటూరుకారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, ఫ్యామిలీ స్టార్, నా సామిరంగ సినిమాలున్నాయి.
వీటిలో గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంది. అదే రోజు హనుమాన్ సినిమా కూడా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 13న ఫ్యామిలీ స్టార్, ఈగల్ సినిమాలతో పాటూ వెంకటేష్ సైంధవ్ కూడా రిలీజ్ కాబోతుంది. జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సుంది.
అంటే కేవలం మూడు రోజుల గ్యాప్ లో 6 కొత్త సినిమాలూ, అందులోనూ పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నమాట. దీని వల్ల ఆడియన్స్ కు నష్టం లేకపోయినా నిర్మాతలకు మాత్రం చాలానే నష్టమొచ్చే అవకాశముంది. ఎక్కువ సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు ఆడియన్స్ కు ఆప్షన్స్ ఎక్కువ కాబట్టి డిమాండ్ ఉన్న సినిమాకు ఎక్కువ వెళ్తారు.
యావరేజ్ టాక్ ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ టైమ్ బాలేక సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాను వెంటనే థియేటర్ల నుంచి తీసేస్తారు. సినిమా హిట్ అయినా సరే, ఇన్ని సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు రిపీట్ ఆడియన్స్ లేక కమర్షియల్ హిట్ అవడం మాత్రం కష్టం అవుతుంది.













