హనుమాన్ కాస్త ఆలోచిస్తే బెటర్
సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని రీసెంట్ గా సాంగ్ రిలీజ్ చేస్తూ కూడా నొక్కి మరీ చెప్పింది చిత్ర బృందం. సంక్రాంతికి రావాల్సిన పర్ఫెక్ట్ మూవీ హనుమాన్ అని కూడా ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
హనుమాన్ చూసినంతసేపు కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రశాంత్ వ్మర్ గ్యారెంటీ ఇస్తున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. కానీ హనుమాన్ రిలీజ్ డేట్ జనవరి 12. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. హనుమాన్ తో పోటీ పడటం వల్ల గుంటూరు కారం టీమ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సమస్యంతా హనుమాన్ టీమ్ కే ఉంటుంది. థియేటర్ల నుంచి ప్రతీ దాన్నీ గుంటూరు కారం సినిమానే డామినేట్ చేస్తుంది. ఇది తెలిసి కూడా హనుమాన్ అదే రోజు రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుబట్టి కూర్చున్నారు. పైగా హనుమాన్ లో స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం కూడా మైనస్. కేవలం విఎఫ్ఎక్స్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలి. అది కూడా మహేష్ సినిమాతో పోటీ పడి. కంటెంట్ పై నమ్మకంతో హనుమాన్ ను చెప్పిన తేదీకి తీసుకురావడం బాగానే ఉంది కానీ ముందు వెనుకా చూసుకోవాలి కదా అని ట్రేడ్ వర్గాలు హనుమాన్ టీమ్ కు సలహాలిస్తున్నాయి. మరి వారి సలహా విని మేకర్స్ ఏమైనా సినిమాను ప్రీ పోన్ లేదా పోస్ట్ పోన్ చేస్తారేమో చూడాలి.













