26న ‘పద్మావత్’ విడుదల ?
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావత్ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా (ఈనెల 26న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి చిత్ర బృందం త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశమున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. సినిమాలో చరిత్రను వక్రీకరించారని రాజ్పుత్ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టరు. దీంతో అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు. ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. కానీ, సెన్సార్ బోర్డు సినిమాలో భారీ కోతలు పెట్టింది.













