దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీని విచారించిన ముంబై పోలీసులు
బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన భారతీయ చిత్ర పరిశ్రమను షాక్‌కి గురి చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు చూచాయగా తెలుసుకున్న కొందరు నటీనటులు నెపోటిజమ్‌కు తాము కూడా బాధితులమే అని ప్రకటించడంతో బయటి వాళ్ళను ఎదగనీయకుండా బాలీవుడ్లో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో బహిర్గతమైంది. ముంబై పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితోపాటు పలువురిని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి 29 మందిని విచారించిన పోలీసులు సోమవారం బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీని పోలీస్ స్టేషన్‌కు రప్పించి ఇంటరాగేట్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు విషయమై కంగనా రనౌత్‌తో పాటు దర్శకుడు శేఖర్ కపూర్‌ను కూడా పోలీసులు విచారించి వారి స్టేట్మెంట్స్ని కూడా రికార్డు చేయనున్నారు. శేఖర్ కపూర్‌ని విచారించడానికి కారణం..
గతంలో సుశాంత్‌లో `పాని8 అనే సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే ఆ సినిమా సెట్స్‌కి వెళ్ళకముందే అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ ఒక్క సినిమానే కాదు ఓ అరడజనుకుపైగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన తర్వాత చేజారి పోయాయి. దీంతో బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని సుశాంత్ బలంగా నమ్మి ఉంటాడు. దాంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏది ఏమైనా 34 ఏళ్ళ వయసులో ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం భారతీయ చిత్ర పరిశ్రమలోని ఎంతోమందిని కలచివేసింది. ఇకపై సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ నటీనటులు, దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.













