లియోలో సంజయ్ దత్ చేస్తున్న క్యారెక్టర్ అదేనా?
తమిళ స్టార్ హీరో విజయ్ మార్కెట్ సినిమా సినిమాకూ పెరగడమే తప్పించి, అస్సలు తగ్గే సూచనలే లేవు. అసలు బోర్ కొట్టేలా ఉందన్న వారసుడు సినిమా కూడా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఆర్థిక ఫలితాల్లో దీనిదే అగ్రస్థానం కావడం గమనార్హం. ఇప్పుడు విజయ్ పారితోషకమే అక్షరాలా 200 కోట్లని, తన 68వ సినిమాకు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ ఓకే అన్నట్లు నెట్టింట వార్త నడుస్తోంది.
విజయ్ ప్రస్తుతం తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లియో అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఈ మూవీలో సంజయ్ దత్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు.
రీసెంట్గా ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంజయ్ దత్, విజయ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్. ఈ సినిమాలో కూడా లోకేష్ మార్క్ కనిపిస్తుందని టాక్. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్‌ని ఎలా ప్రెజెంట్ చేశాడో, ఈ సినిమాలో విజయ్ ను కూడా అంతకుమించి చూపించనున్నాడట.
అక్టోబర్ 19న లియో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో పాటుగా అదే దసరా సీజన్లో తెలుగులో బాలకృష్ణ, రవితేజ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. మరి లియో సినిమాతో విజయ్ పాన్ ఇండియన్ రేంజ్లో ఎంత వసూలు చేస్తాడో చూడాలి.













