Sanjay Dutt: తెలుగు నేర్చుకుంటున్నానన్న బాలీవుడ్ నటుడు

కన్నడ యాక్షన్ హీరో ధృవ సర్జా(Dhruva Sarja) హీరోగా ప్రేమ్(Prem) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కేడీ ది డెవిల్(KD The Devil). ఈ సినిమా సంజయ్ దత్(Sanjay Dutt), శిల్పాశెట్టి(Shilpa Shetty), నోరా ఫతేహీ(Nora Fatehi) కీలక పాత్రలు పోషిస్తుండగా రీష్మా నానయ్య(reesham nanayya) హీరోయిన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్ కు చిత్రంలో నటించిన కీలక నటీనటులు హాజరయ్యారు.
ఈవెంట్ లో భాగంగా సంజయ్ దత్ మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ తో తనకు చాలా స్పెషల్ బాండింగ్ ఉందని, ఇప్పటికే తాను టాలీవుడ్ లోని చాలా మందితో కలిసి పని చేశానని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో దొరికే ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని సంజయ్ దత్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) తో కలిసి ఓ సినిమా చేస్తున్నానని కూడా సంజయ్ దత్ తెలిపారు.
తెలుగు సినిమాలు చేస్తున్న కారణంగా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి తాను పెద్ద అభిమానినని అని సంజయ్ దత్ తెలిపారు. కేడీ ది డెవిల్ సినిమాను నిర్మాతలు చాలా గ్రాండ్ గా రూపొందించారని, హీరో ధృవ సర్జా తనకు తమ్ముడు లాంటి వాడని, రీష్మా చాలా గొప్ప నటి అని, శిల్పా శెట్టితో కలిసి పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని చెప్పారు. కాగా సంజయ్ దత్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సంజయ్ దత్ ఆత్మగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 5న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.