సంజనరెడ్డి టీజర్ ను విడుదల చేసిన సాయివెంకట్
రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన అనువాద చిత్రం సంజనరెడ్డి. పి.టి.సెల్వ కుమార్ దర్శకుడు. కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్ నిర్మాత. ఈ నెల 5న తెలుగులో విడుదల కానుంది. హైదరాబాద్‌లో సాయివెంకట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ భార్యలకి దూరమైన నలుగురు వ్యక్తులు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. వాళ్లందరికి ఆ అమ్మాయి ఎలా బుద్ది చెప్పిందో తెర పైనే చూడాలి. రాయ్‌లక్ష్మి నటన ఆకట్టుకుంటుందన్నారు. కె స్వరకల్పనలోని పాటులు అలరిస్తాయి. కథని బట్టి సంభాషణలు ఉంటాయన్నారు. సంభాషణల రచయిత శ్రీసాయి. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నూనె రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.













