Sai Pallavi: అర్జున్ రెడ్డి సాయి పల్లవితో చేయాల్సింది: సందీప్ రెడ్డి
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Thandel Pre Release Event) కు వచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నిషేర్ చేసుకున్నాడు. తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి(Arjun Reddy) కోసం హీరోయిన్ కు వెతికే టైమ్ లో ప్రేమమ్(Premam) చూసిన అతని మనసులో సాయి పల్లవి(Sai Pallavi) ఉండిపోయిందని, అందుకే కేరళ నుంచి పల్లవి కో ఆర్డినేటర్ గా చెప్పుకునే ఓ వ్యక్తి నెంబర్ సంపాదించి మరీ ఆయన్ని కాంటాక్ట్ అయినట్టు తెలిపాడు.
తన సినిమా ఓ ప్రేమకథ అని చెప్పగానే ఆ కోర్డినేటర్ అలా అయితే మీరు సరైన పర్సన్ కోసమే వెతుకుతున్నారని చెప్పాడని, కానీ తన మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పడంతో అయితే సాయి పల్లవి గురించి మర్చిపొమ్మని, తను స్లీవ్‌లెస్ కూడా ధరించదని ఆయన చెప్పాడని సందీప్ చెప్పాడు.
ఆ విషయం విన్న తర్వాత సందీప్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరైనా ఇంతే అంటారులే అనుకున్నానని, కానీ సాయి పల్లవి వచ్చి పదేళ్లు దాటుతున్నా ఆమె తన కట్టుబాట్లను ఎప్పుడూ మర్చిపోకుండా మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందని, అదే తనను ఆమెకు అభిమానిగా మార్చిందని సందీప్ వంగా వెల్లడించాడు.













