సందీప్ తో చిరూ సినిమా..?
కుర్ర హీరోలు కూడా అందుకోలేరేమో అనేంత స్పీడ్ గా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కరోనా లాక్ డౌన్ టైమ్ లో నలుగురు డైరక్టర్లతో సినిమాల్ని ఓకే చేసుకున్న విషయం విదితమే. ఆ నలుగురిని అందరికీ పరిచయం చేశాడు కూడా. కొరటాల శివతో ఆచార్య, మోహన్ రాజా తో లూసీఫర్ రీమేక్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఆచార్య షూటింగ్ క్లైమాక్స్ దిశకు చేరుకుంటే, మోహన్ రాజా స్క్రిప్ట్ ఫైనల్ అవుతుందని తెలుస్తుంది.
వారిద్దరితో పాటుగా మెహర్ రమేష్, బాబీలతో కూడా సినిమాలు చేస్తున్నానని చిరూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. బాబీతో స్ట్రెయిట్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరూ, మెహర్ రమేష్ తో మాత్రం వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఆచార్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న మెగాస్టార్ ఇప్పుడు వేరే స్క్రిప్ట్ ల పైనే తన ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.
వరుసగా దర్శకుల్ని ఫైనల్ చేసే పనిలో చిరూ ఉన్నారని, ఆ దశలోనే వినాయక్, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగాలు రేస్ లో ఉన్నారని సమాచారం. ఈ ముగ్గురిలో సందీప్ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసే యోచనలో మెగాస్టార్ ఉన్నాడట. రెండు మూడు రోజుల్లో సందీప్ మెగాస్టార్ కు ఫుల్ స్క్రిప్ట్ నెరేట్ చేయనున్నాడట. స్ర్కిప్ట్ నచ్చితే ఈ సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడనే టాక్ బాగా వినిపిస్తుంది. ఇక వివి వినాయక్, వంశీ వినిపించిన స్టోరీలు ఇప్పటికే రిజెక్ట్ అయిన విషయం తెలిసిందే. వినాయక్ స్టోరీ నచ్చకపోవడంతోనే మోహన్ రాజా కు ఆఫర్ ఇచ్చాడు చిరూ. వంశీ కూడా తన కథ చెప్పి ఒప్పించడంలో విఫలమయ్యాడని అప్పట్లో ప్రచారమైంది. కానీ వాళ్లు ఏదైనా మంచి స్క్రిప్ట్ తో వెళ్తే చిరూని ఒప్పించే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఫస్ట్ వేవ్ టైమ్ లో నలుగురు డైరక్టర్లని ఫిక్స్ చేసిన చిరూ, సెకండ్ వేవ్ లో ఎంతమంది డైరక్టర్లను ఖాయం చేస్తాడో చూడాలి.













