Ram Charan: వయొలెంట్ డైరెక్టర్ తో చరణ్ సినిమా?
గేమ్ ఛేంజర్(Game Changer) డిజాస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది(Peddi) అనే భారీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. పెద్ది తర్వాత రామ్ చరణ్, తనకు రంగస్థలం(Rangasthalam) లాంటి సూపర్ హిట్ ను అందించిన సుకుమార్(Sukumar) తో సినిమా చేయనున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నాడని ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, ఆ లైనప్ లో రోజుకో కొత్త పేరు వినిపిస్తుంది. మొన్నటివరకు ఈ లైనప్ లో త్రివిక్రమ్(Trivikram) పేరు కూడా వినిపించింది. అంతేకాదు, టాలీవుడ్ వయొలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)తో కూడా సినిమా చేసే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే సందీప్ తో చరణ్ సనిమా ఉన్నా లేకపోయినా బాలీవుడ్ మోస్ట్ వయొలెంట్ మూవీ కిల్(Kill) ను తీసిన డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh Bhatt) తో రామ్ చరణ్ సినిమా చేసే ఛాన్సుదని తెలుస్తోంది. గతంలో కూడా ఈ కాంబినేషన్ పై వార్తలొచ్చాయి కానీ అప్పుడు ఈ వార్తల్ని పెద్దగా పట్టించుకోలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే కొన్నాళ్ల పాటూ వెయిట్ చేయాల్సిందే.






