స్పీడు పెంచాల్సిందే సందీప్!
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన సందీప్ రెడ్డి వంగా ఎవరూ ఊహించని స్థాయిలో క్రేజీ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనేలా ఆయన ఇంపాక్ట్ చేయగలిగాడు. సందీప్ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు సందీప్. సందీప్ సినిమాలకు హిట్ టాక్ ఎలా వస్తుందో విమర్శలు కూడా అలానే వస్తాయి. అయినప్పటికీ ఆయన సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. అయితే సందీప్ ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు పూర్తైంది. ఈ ఏడేళ్లలో ఆయన తీసింది రెండే సినిమాలు.
ఒకటి అర్జున్ రెడ్డి, రెండోది యానిమల్. మధ్యలో అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు, అది కొత్త కథ కాదు కబట్టి లెక్కలోకి తీసుకునే పన్లేదు. సందీప్ తీసింది రెండు సినిమాలే అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఈ నేపథ్యంలో సందీప్ వర్క్ స్పీడ్ పెరిగితే బావుంటుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన చేయాల్సిన యానిమల్2, స్పిరిట్ పూర్తి చేయడానికే ఎంత లేదన్నా మరో ఐదేళ్లు పడుతుంది. అంటే మొత్తం 12 ఏళ్ల కెరీర్లో ఆయన తీసేది నాలుగు సినిమాలే. అందుకే వర్క్ స్పీడ్ పెంచాలని అందరూ కోరుతున్నారు.













