Spirit: స్పిరిట్ విషయంలో సందీప్ యానిమల్ ను ఫాలో అవుతాడా?

తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటిని తెరకెక్కించడానికి బాగా ఆలస్యమవుతుంది. బడ్జెట్ నుంచి షూటింగ్ టైమ్ వరకు అన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం పక్కా ప్లానింగ్ తో చాలా తక్కువ టైమ్ లోనే పాన్ ఇండియా సినిమాలను కూడా తెరకెక్కిస్తుంటారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) కూడా ఒకరు.
సందీప్ తన సినిమాలను మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే వాటిని పూర్తి చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే యానిమల్(animal) మూవీని కూడా కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేశాడు సందీప్. కానీ యానిమల్ సినిమా చూస్తే ఎక్కడా హడావిడిగా తీసినట్టు అనిపించదు. అదే సందీప్ స్పెషాలిటీ. అలాంటి సందీప్ తన నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) తో చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాజా సాబ్(the raja saab), ఫౌజీ(fauji) సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తర్వాత సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నాడు. స్పిరిట్(spirit) లో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే యానిమల్ సినిమాలానే ప్రభాస్ సినిమాను కూడా సందీప్ కేవలం 100 రోజుల్లో పూర్తి చేయగలడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ స్పిరిట్ కు సంబంధించిన మేజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను పూర్తి చేయించుకున్న సందీప్ తలచుకోవాలే కానీ అదేమీ పెద్ద విషయం కాదంటున్నారు నెటిజన్లు. కాగా స్పిరిట్ లో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ(tripti Dimri) హీరోయిన్ గా నటిస్తోంది.