నానితో సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్వూ
చాలా కాలం తర్వాత మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతుంది. ఈ డిసెంబర్ 1 నుంచి నాన్‌స్టాప్ గా సినిమాలు రిలీజ్ కానున్నాయి. రానున్న అన్నీ సినిమాలపై కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. వాటిలో ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందనేది రిలీజ్ తర్వాతే చూడాలి. డిసెంబర్ 1న యానిమల్ తో ఈ సందడి మొదలుకానుంది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక నటిస్తున్నారు. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమా వచ్చిన వారానికి నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా తర్వాత నాని నుంచి వస్తోన్న సినిమా కావడంతో హాయ్ నాన్నపై మంచి అంచనాలున్నాయి.
ట్రైలర్ కూడా దానికి తగ్గట్లే ఉండటంతో డిసెంబర్ 7న రిలీజ్ కానున్న హాయ్ నాన్నపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ లో భాగంగా కలుసుకోవడం విశేషం. అందులో భాగంగానే సందీప్ రెడ్డి వంగాతో కలిసి నాని ఓ ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఈ ఇంటర్వ్వూ యానిమల్, హాయ్ నాన్న కు మంచి బజ్ ను తీసుకురానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యానిమల్, హాయ్ నాన్న రెండూ కూడా తండ్రి సెంటిమెంట్ సినిమాలే. హాయ్ నాన్న కూతురు సెంటిమెంట్ తో వస్తుంటే, యానిమల్ తండ్రి సెంటిమెంట్ తో రానుంది.













