స్పిరిట్ అలా ఉంటుందంటున్న సందీప్
ప్రభాస్ లైనప్ లో ఎన్ని సినిమాలున్నా అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా అంటే స్పిరిట్ నే. యానిమల్ సినిమాలో రణ్బీర్ లాంటి సాఫ్ట్ హీరోనే మోస్ట్ వయొలెంట్ గా చూపించి రూ.900 కోట్లను కలెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా, ఇక ప్రభాస్ లాంటి మాస్ హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని చూడటానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో సైతం నార్మల్ ఆడియన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. ఈ కల్ట్ డైరెక్టర్ త్వరలోనే స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్తానంటున్నాడు. రీసెంట్ గా స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాల్ని వెల్లడించాడు. ఇప్పటికే స్పిరిట్ లో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడని చెప్పిన సందీప్, మరికొన్ని విషయాల్ని చెప్పాడు.
స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ హీరో వ్యక్తిత్వానికి, ఆవేశానికి మ్యాచ్ అయేలా ఉంటుందని, డ్యూటీ చేస్తున్న క్రమంలో దానికి అడ్డొచ్చేలా ఏదైనా జరిగినప్పుడు, తన సిద్ధాంతానికి భిన్నంగా తప్పుని గుర్తించినప్పుడు ఖాకీ దుస్తుల్లోని మృగాన్ని బయటకు తెస్తే ఎలా ఉంటుందో అలా ప్రభాస్ ను చూస్తారట. దీన్ని రెగ్యులర్ స్టైల్ లో కాకుండా సందీప్ మార్క్ ను ట్రీట్మెంట్ లో తెరకెక్కించనున్నాడని టాక్. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తవగానే స్పిరిట్ మొదలయ్యే ఛాన్సుంది.













