బాలీవుడ్ కాకపోతే హాలీవుడ్ లో సినిమా చేస్తా: సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాలోనే హీరో క్యారెక్టర్ ను ఓవర్ గా ఎమోషన్స్ తో కట్టిపడేసిన సందీప్, ఆ హీరోకు లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆ సినిమా ద్వారా చూపించాడు. అర్జున్ హిట్ మంచి హిట్ అయినప్పటికీ చాలా మంది నుంచి ఆ సినిమా విషయంలో ఎన్నో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి సినిమాలు తీస్తే యూత్ చెడిపోతారని ఎంతో మంది మీడియా ముందుకొచ్చి గొడవ చేశారు. ఆ టైమ్ లో సందీప్ ఆ విమర్శలకు బదులిస్తూ, తన సినిమాలను తెలుగులో అడ్డుకుంటే బాలీవుడ్ కు వెళ్లి సినిమాలు చేస్తా అని చెప్పాడు. చెప్పినట్టే కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చేశాడు. యానిమల్ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్.
అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చినట్లే ఈ సినిమాకు కూడా చాలా విమర్శలొచ్చాయి. సినిమాలో హింస ఎక్కువైందని కొందరు, హీరోయిన్ ను తక్కువ చేసి చూపించారని మరికొందరు కామెంట్ చేశారు. సందీప్ ఆ విమర్శలకు రీసెంట్ గా ఆన్సరిచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు సైతం ఇలాంటి కామెంట్స్ చేయడం బాధగా ఉందని చెప్పిన సందీప్, బాలీవుడ్ లో కూడా తన సినిమాలను అడ్డుకుంటే హాలీవుడ్ కు వెళ్లి సినిమాలు చేస్తానని చెప్పాడు. తనకు భాషా పరిమితులు లేవన్న సందీప్, చెప్పినట్టుగానే ఏదొక రోజు హాలీవుడ్ లో సినిమా చేసినా చేస్తాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













