Spirit: డార్లింగ్ లుక్స్ ను లాక్ చేసిన సందీప్
మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్(the raja saab) ను రిలీజ్ కు రెడీ చేస్తున్న ప్రభాస్(prabhas), మరోవైపు ఫౌజీ (Fauji)సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు. ఇంకోవైపు స్పిరిట్(spirit) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ ఎప్పుడో అనౌన్స్ అయినా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో చాలా మంది దీని కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే స్పిరిట్ గురించి ఇప్పుడో వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన టెస్ట్ షూట్ పూర్తైందని, టెస్ట్ షూట్ అయ్యాక చిత్ర యూనిట్ మూడు పవర్ఫుల్ హై ఓల్టేజ్ లుక్స్ ను ఫైనలైజ్ చేశారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇప్పుడా లుక్ ను సందీప్ ఫైనల్ చేశాడని తెలుస్తోంది.
అయితే డార్లింగ్ కోసం మూడు లుక్స్ ను ఫైనల్ చేసిన చిత్ర యూనిట్, ఆ మూడు లుక్స్ తో ప్రభాస్ ను చూపించనున్నారా లేక ఆ మూడింటిలో మళ్లీ ఓ లుక్ ను ఫిక్స్ చేసి ఆ లుక్ లో డార్లింగ్ ను ప్రెజెంట్ చేయనున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టి దాదాపు ఐదు రోజుల పాటూ షూటింగ్ ను చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ(tripti Dimri) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.






