భైరవకోన ఆలస్యానికి రీజనేంటి?
జయాపజయాలతో సంబంధం లేకుండా సందీప్ కిషన్ కు టాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు ఉంది. ఎంత కష్టపడినప్పటికీ సందీప్ కు సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. కానీ సందీప్ కు మంచి స్టోరీ పడితే బాక్సాఫీస్ వద్ద లాభాలు రాబట్టగలడని నిను వీడని నీడను నేనే సినిమా ప్రూవ్ చేసింది. అలాంటి సందీప్ నుంచి లాస్ట్ గా వచ్చిన సినిమా మైఖేల్.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ మూవీపై సందీప్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. అతను నటిస్తున్న తాజా సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అయోమయంలో ఉన్నారు సందీప్ ఫ్యాన్స్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవడంతో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి.
కొన్ని నెలల క్రితం రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తర్వాత ఇప్పటి వరకు ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అనిల్ సుంకర సమర్పించిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సందిగ్ధంలో ఉన్నారు. ఈ సినిమా స్టోరీ విరూపాక్ష మూవీకి కొంచెం సిమిలర్ గా ఉందని కొన్ని రీషూట్స్ చేస్తున్నారని, అందుకే సినిమా రిలీజ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదనేది కొందరు చెప్తున్న మాట. రిలీజ్ లేటవుతుందని ఏదైనా అప్డేట్ ఇచ్చినా ఫ్యాన్స్ సినిమా గురించి మర్చిపోకుండా ఉంటారు. అలా కాకుండా ఏ అప్డేట్ లేకుండా ఉంటే ఆడియన్స్ ఈ సినిమాను మర్చిపోయే ప్రమాదముంది.













