మలయాళ బ్యూటీ లైనప్ మామూలుగా లేదుగా
సౌత్ టాలెంటెడ్ హీరోయిన్లలో మలయాళ భామలు ఎక్కువగా ఉంటారు. తమ నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకునే మలయాళ భామలు ఏ సినిమా చేసినా కచ్ఛితంగా అందులో తమదైన ముద్ర వేసుకుంటారు. ఈ మధ్య సౌత్ లో బాగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్. పాప్ కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది సంయుక్త.
భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ సినిమాలో కనిపించింది కాసేపే అయినా తనదైన ముద్ర వేసుకుంది. తర్వాత బింబిసారతో మంచి హిట్ అందుకుంది. విరూపాక్ష సినిమాలో హీరోయిన్ గా నటించి విభిన్న పాత్ర చేసి అందర్నీ మెప్పించింది. ఆమె నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు.
కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమా కూడా చేసింది కానీ అది డిజాస్టర్ అవడంతో అమ్మడిపై ఆడియన్స్ ఫోకస్ తగ్గింది. అయినా సరే సంయుక్త జోరు ఏ మాత్రం తగ్గలేదని ఆమె సినిమాల లైనప్ చూస్తుంటే తెలుస్తోంది. నిఖిల్ స్వయంభులో హీరోయిన్ గా చేస్తున్న సంయుక్త, శర్వానంద్- రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాలో కూడా సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటూ హిందీలో మహారాగ్ని, మలయాళంలో మోహన్‌లాల్ తో రామ్ సినిమాలో ఓ కీలక పాత్ర, తమిళంలో ఓ సినిమాలో కూడా సంయుక్త ఎంపికైనట్లు తెలుస్తోంది. మొత్తానికి 6 సినిమాలతో సంయుక్త బిజీగా ఉంది. ఇవన్నీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలే.













