Samyuktha Menon: సంయుక్తకి ఇది పెద్ద ఆఫరే!
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Srinu)తో అఖండ2 తాండవం (AKhanda2 Thandavam) చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య(Balayya) కెరీర్లో మొదటి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అందరికీ బోలెడు అంచనాలున్నాయి. రీసెంట్ గా అఖండ2 గురించి తమన్(Thaman) మాట్లాడుతూ ఇంటర్వెల్ కే టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ అంచనాలను మరింత పెంచాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో తాజాగా ఓ అనూమ్య మార్పు జరిగినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్(Samyuktha Menon) ని లాక్ చేసుకున్నారు. ముందుగా అఖండ2 కోసం అఖండలో నటించిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal)నే అనుకున్నారు. సినిమా ఓపెనింగ్ కు కూడా ప్రగ్యా హాజరైంది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి సంయుక్త వచ్చి చేరింది.
కథ ప్రకారం చిన్న బాలయ్య భార్యగా ప్రగ్యా ఉంది. దీంతో సంయుక్త అఖండ2లో ఏ పాత్రలో కనిపిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. ఏదేమైనా సంయుక్తకి ఇది చాలా పెద్ద అవకాశమనే చెప్పాలి. ఇప్పటివరకు సీనియర్ హీరోలతో జత కట్టని సంయుక్తకి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం. సెప్టెంబర్ 25న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.













