Samyuktha Menon: ఆల్కహాల్ అలవాటు ఉందన్న సంయుక్త మీనన్
తెలుగుతో పాటూ తమిళ, మలయాళ సినిమాల్లో నటించి సౌత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సంయుక్త మీనన్(Samyuktha menon). భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త వరుస హిట్లతో సక్సస్ఫుల్ హీరోయిన్ గా మారింది. అమ్మడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే సంయుక్తకు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే సంయుక్త తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంయుక్త తన లైఫ్ స్టైల్ గురించి చెప్తూ కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.
తనకు ఆల్కహాల్ సేవించే అలవాటుందని, అయితే అదే పనిగా తాగనని, ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొంచెం తీసుకుంటానని మొహమాట పడకుండా చెప్పేసింది. ఇలాంటి విషయాలు సాధారణంగా ఎవరూ బయటకు చెప్పుకోరు. కానీ సంయుక్త మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే సంయుక్త ప్రస్తుతం స్వయంభు(Swayambhu), అఖండ2(Akhanda2) సినిమాల్లో నటిస్తోంది.













