సముద్రుడు టీజర్ విడుదల
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్, శ్రీ రామోజు జ్ఞానేశ్వర్, సోములు నిర్మించిన చిత్రం సముద్రుడు. రమాకాంత్, భానుశ్రీ, అవంతిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో రమాకావత్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు సముద్ర ఆవిష్కరించారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ నా కూతురు కీర్తన పేరు మీద ప్రొడక్షన్ స్టార్ట్ చేశామన్నారు. తను నాకు బాగా కలిసొస్తుందనే ఈ సినిమాను చేయటం జరిగిందన్నారు. చేపలు పట్టే వారి జీవన శైలిపై తీసిన చిత్రమన్నారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథ అన్నారు. మంచిపాత్ర ఇచ్చినందుకు దర్శకుడు నాగేష్ గారికి కృతజ్ఞతలు అని తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ భానుశ్రీ తదితరులు మాట్లాడారు.













