షూటింగ్ పూర్తిచేసుకున్న సముద్రుడు
రమాకాంత్ కథానాయకుడిగా కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం సముద్రుడు. భానుశ్రీ, అవంతిక నాయికలు. నగేష్ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. బదావత్ కిషన్ నిర్మాత. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వాణిజ్యాంశాలతో పాటు ఒక మంచి సందేశం ఉంటుంది. చీరాల ఓడరేవు తీరంలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. త్వరలోనే విదేశాల్లో పాటల్ని తెరకెక్కిస్తాం అన్నారు. సుమన్, రామరాజు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్.













