మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా.. బజార్ రౌడీ
సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా డి.వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బజార్‌రౌడీ. మహేశ్వరి వద్ది కథానాయిక. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాత. ఈ నెల 20న చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. దర్శకుడు మాట్లాడుతూ సంపూ స్టైల్లో సాగే వాణిజ్య ప్రధానమైన చిత్రమిది. నవ్వులు, కిక్కిచ్చే పోరాటాలు, పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చిరంజీవి అంటే సంపూకి చెప్పలేనంత అభిమానం. అందుకే చిరు పుట్టిన రోజుని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. నవ్వులు రువ్వే మా రౌడీ సందడి ఇంటిల్లిపాదినీ అలరిస్తుందన్నారు నిర్మాత. నాగినీడు, సాయాజీ షిండే, పృథ్వీ, షఫి సమీర్, మణిచందన నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం, ఎ.విజయ్‌కుమార్, మాటలు: మరుధూరి రాజా.













