సంపత్ నంది పెద్ద యుద్ధమే చేశాడు
మాస్ డైరెక్టర్ గా తనకంటూ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రీసెంట్ గా తన తర్వాతి సినిమాను శర్వానంద్ తో అనౌన్స్ చేశాడు. ఈ సినిమా శర్వా కెరీర్లో 39వ సినిమాగా తెరకెక్కనుంది. అయితే ఈ అవకాశం కోసం సంపత్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. సంపత్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికి మూడేళ్లవుతుంది.
సిటీమార్ తర్వాత సంపత్ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు. రైటర్ గా కొన్ని సినిమాలొచ్చాయి కానీ డైరెక్టర్ గా మాత్రం రాలేదు. అయితే సంపత్ గ్యాప్ కు కారణం ఇండస్ట్రీలో వచ్చిన మార్పులని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ పక్కా కమర్షియల్ సినిమాలు. ఇప్పుడు ట్రెండ్ తో పాటూ ఆడియన్స్ కూడా మారారు.
యూనిక్ స్టోరీలతో పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్టులను మాత్రమే తీస్తున్నారు. ఆ కోణంలో చూసుకుంటే సంపత్ చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ మూడేళ్లలో కొత్త కథపై సంపత్ భారీ యుద్ధమే చేసినట్లున్నాడు. 1960 బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ- మహారాష్ట్ర మధ్య జరిగే పీరియాడిక్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. మరి శర్వాతో సంపత్ నంది ఎలాంటి సినిమాను తీసి ఆడియన్స్ ను మెప్పిస్తాడో చూడాలి.













