మాస్ డైరెక్టర్ తో తేజూ సినిమా
మొదటి సినిమా రేయ్ తప్పించి, కెరీర్ మొదట్లో మంచి ఫామ్లో వరుస విజయాలు అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు అతణ్ని సుప్రీం హీరోను చేశాయి. కానీ ఆ తర్వాత మాత్రం కంటిన్యూస్ ఫ్లాప్ లు అందుకున్నాడు. మళ్లీ చిత్రలహరితో హిట్ కొట్టి, ప్రతి రోజూ పండగే సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.
ఆ తర్వాత మళ్లీ సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ సినిమాలు తేడా కొట్టేశాయి. ఇప్పుడు విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చూస్తుంటే విరూపాక్షతో తేజూ హిట్ కొట్టేలానే ఉన్నాడు. టాక్ బాగుంటే థ్రిల్లర్ సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఈజీగా సిక్స్ కొడుతుంది. ఈ సినిమా తర్వాత పవన్ తో వినోదాయ సీతం రీమేక్ లో నటిస్తున్న తేజూ తన సోలో సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లలేదు.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, సాయి ధరమ్ తేజ్ మాస్ డైరెక్టర్ సంపత్ నందితో తన తర్వాతి సినిమాను చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. సీటీమార్ తర్వాత సంపత్ నంది చాలా గ్యాప్ తీసుకుని తేజూతో సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కే ఛాన్సుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.













