Sambarala Yetigattu: SYG అవుట్ స్టాండింగ్ సినిమా ఇది నా ప్రామిస్! – సాయి దుర్గ తేజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా మూవీ SYG (సంబరాల యేటిగట్టు) గూస్‌బంప్స్ అసుర ఆగమన గ్లింప్స్ రిలీజ్
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ క్రేజీ పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల యేటిగట్టు) తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ స్టొరీతూ విజువల్ ట్రీట్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది.
“సంబరాల ఏటిగట్టు (SYG)” వరల్డ్ ని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతంగా వుంది. అంబిషన్‌తో కూడిన మిథికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సాయి దుర్గ తేజ్‌ను ఒ పవర్ ఫుల్ యోధుడి పరిచయం చేస్తూ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.
సాయి దుర్గ తేజ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషన్స్ అదిరిపోయాయి. కళ్లలో మండే ఆవేశం, బలమైన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లలోని ఫైర్ అన్నీ కలిపి ఆయన పాత్రను లార్జర్ దెన్ లైఫ్ ప్రజెంట్ చేశాయి. ఇది ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన గ్రాండియర్‌ను ఇచ్చాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రివెల్ పళనిసామీ కెమెరా వర్క్ అదిరిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో వుంది. కాంతార ఫేమ్ బి.అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ఎలివేట్ చేసింది ఎడిటర్ నవీన్ విజయకృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ టెక్నికల్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.
“అసుర ఆగమనం” గ్లింప్స్ తెలుగు సినిమాకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసేలా ఉంది. సాయి దుర్గా తేజ్, రోహిత్ కె.పి. ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు మిథికల్ యాక్షన్ సినిమాల స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
అసుర ఆగమన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలు చిరంజీవి గారు కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు బర్త్డే విషెస్ అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది.సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అద్భుతమైన క్వాలిటీతో ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేసి చేస్తున్నాము. మా నిర్మాతలు నిరంజన్ గారు చైతన్య గారు చాలా సపోర్ట్ చేశారు. ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఆయేషా గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కి దాదాపుగా 50 కాస్ట్యూమ్స్ చేశారు. గాంధీ గారు అద్భుతంగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. నా విరూపాక్ష సినిమాకు మ్యూజిక్ చేసిన అజినీస్ ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నారు. తను హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. తన విజన్ మీ అందరికీ నచ్చుతుంది. సినిమా అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. దేవకట్టా, వశిష్ట, వివేక్, ఆనంద్ గారికి థాంక్ యూ. ఇది వండర్ఫుల్ ఫిలిం. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్.
ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. థాంక్యూ మీడియా. ఆనంద్ గారు వశిష్ట గారు దేవకట్టు గారు వివేక్ గారికి థాంక్యూ. ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ గారు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. దుర్గ తేజ్ గారికి హ్యాపీ బర్త్డే.
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాయి అన్నకి హ్యాపీ బర్త్డే. అన్న సపోర్ట్ ని మర్చిపోలేము. టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సాయి అన్నని ఎంత గ్రాండ్ గా చూపించాలని అనుకున్నాము. ఆ నమ్మకంతోనే ఈ సినిమాని తీస్తున్నాము. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సాయి అన్నని చూసి మా టీమ్ అంతా చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఆయనలాగా ఫిట్ గా ఉండాలని అనుకుంటున్నాము. మీకు ఎప్పటికీ రుణపడి ఉండే ప్రొడక్షన్ హౌస్ మాది. సినిమా అంటే అభిమానించే వాళ్ళు లేకపోతే ఒక ప్రొడక్షన్ హౌస్ గా మేము ఉండలేము. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ.
డైరెక్టర్ రోహిత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ గారు అయినంతగా ట్రాన్స్ఫర్మేషన్ మిగతా వారికి అంత ఈజీ కాదు ఆయన బౌన్స్ బ్యాక్ అయిన విధానం వెరీ ఇన్స్పైరింగ్ ఆయన ఈ జర్నీలో చాలా సపోర్ట్ ఇచ్చారు నా ఫస్ట్ ఫిల్మైనప్పటికీ నిరంజన్ గారు చైతన్య గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేశారు నా మీద ఉంచిన కాన్ఫిడెన్స్ కి థాంక్స్ చెప్తున్నాను అద్భుతమైన టీం తో చేసిన సినిమా ఏది నా ఎఫెక్ట్ ఎంతుందో దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ వాళ్ళు ఉంది అందరికీ థాంక్యు వెరీ మచ్
డైరెక్టర్ దేవకట్ట మాట్లాడుతూ.. సాయి హ్యాపీ బర్త్డే. రిపబ్లిక్ సినిమాతో నాకు సాయి ఒక తమ్ముడిలా దొరికాడు. తేజ్ లో ఉన్న ఫైటర్ ని నా జర్నీలో చూశాను. సంబరాల ఏటిగట్టు ఒక యాక్షన్ డ్రామా. అద్భుతంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించబోతుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్ గారికి హ్యాపీ బర్త్డే. నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాజులేషన్స్. హనుమాన్ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ సంవత్సరం ఓజీతో మెగా బ్లాస్ట్ స్టార్ట్ అయింది. నిన్న చిరంజీవి గారు ఒక బ్లాస్ట్ ఇచ్చారు. ఈరోజు సుప్రీం హీరో ఒక బ్లాస్ట్ ఇచ్చారు, ఇది కంటిన్యూ కావాలి.
డైరెక్టర్ వి ఐ ఆనంద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాయి గారికి హ్యాపీ బర్త్డే. ఆయన జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయన ట్రాన్స్ఫార్మ్ చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చాయి. రెండేళ్లు పాటు అదే కరెక్ట్ గా ఉండడం అంత ఈజీ కాదు. సాయి గారికి హాట్సాఫ్. ఈ సినిమా తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను.
నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ప్రైమ్ షో అంటేనే గ్రాండియర్. చైతన్య గారికి నిరంజన్ గారికి ఆల్ ది బెస్ట్. సాయి చాలా మంచి మనిషి. ఆయనకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.
డీవోపీ పళని స్వామి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాయి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. రోహిత్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన మైండ్ లో ఉన్న విజువల్ ని స్క్రీన్ మీదకు తీసుకురావడం పెద్ద ఛాలెంజ్. టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని అద్భుతంగా చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.