గందరగోళంలో సమంత నిర్మాతలు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య మాయోసైటిస్ అనే వ్యాధి తో బాధ పడున్న విషయం తెలిసిందే. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అయితే సమంత త్వరగా కోలుకొని మామూలు స్థితికి రావాలి అని అందరు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందని, తనని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేర్చారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆమె పర్సనల్ టీం స్పందించారు. సమంత ఆరోగ్యంగానే ఉన్నట్లు, హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేదు అని స్పష్టం చేసారు. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సమంత గత కొద్ది కాలంగా సినిమాలకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండట్లేదు. వైద్యుల పర్యవేక్షణలోనే యశోద సినిమా డబ్బింగ్ ని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి తన అభిమానులతో షేర్ చేసుకొని ఎమోషనల్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ అయిన యశోద సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. పోటీకి మరో సినిమా లేకపోవడంతో సామ్ కి కలిసొచ్చిందనే చెప్పాలి. సమంత అనారోగ్యం కారణంగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాయి.
సమంత విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయిందని సమాచారం.ఇంకా కొంత భాగం పూర్తి చేసే క్రమంలో విజయ్ లైగర్ సినిమా ప్రమోషన్స్‌కి అటెండ్ అయ్యే పనిలో షూటింగ్ కి బ్రేక్ పడింది. అదే సమయంలో సామ్ ఆరోగ్యం క్షీణించడం, ట్రీట్మెంట్ ప్రారంభించడం వల్ల ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పొచ్చు.క్రిస్మస్ కానుకగా ఈ రొమాంటిక్ ఎంటటైనర్ ని ప్రేక్షకులకి అందించాలి అనుకున్న దర్శకుడు ఇప్పుడు వచ్చే సంవత్సరం వేసవి సెలవులకి రిలీజ్ డేట్ షిఫ్ట్ చేసుకున్నారు.
అలాగే హిందీ మరియు తమిళ్ భాషలలోనూ సామ్ కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. అన్నీ అనుకూలంగా ఉంటే అందులో కొన్ని సెట్స్ పైకి కూడా వచ్చి ఉండేవి. సైన్ చేసిన వాటిలో ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. సామ్ ఎప్పుడు కోలుకుంటే అప్పుడు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. కానీ సామ్ ఎప్పుడు కోలుకుంటుంది అనేది తెలియట్లేదు. ఈ సమయంలో సమంత తీవ్ర అస్వస్థత తో హాస్పిటల్ లో చేరింది అనే వార్తలు మేకర్స్ ని ఇబ్బంది పెడ్తున్నాయి. ప్రస్తుతానికి సమంత మాయోసైటిస్ థర్డ్ స్టేజి లో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే తాను పూర్తిగా కోలుకొని ప్రేక్షకుల ముందుకి రావాలని ఆశిద్దాం.













