సమంతతో టిల్లూ బోయ్
ఒకప్పుడు టాలీవుడ్లోని స్టార్ హీరోల పక్కన వరుసగా కమర్షియల్ మూవీస్ చేసిన సమంత, తర్వాత కొన్నాళ్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.యూటర్న్, ఓ బేబీ, యశోద లాంటి సినిమాలు ఆమెకు మంచి రిజల్ట్ ని ఇచ్చాయి. కానీ రీసెంట్గా వచ్చిన శాకుంతలం మాత్రం సమంతకు దారుణమైన డిజాస్టర్ ను ఇచ్చింది.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి అనే ప్రేమ కథా చిత్రం చేస్తున్న సమంత, ఈ సినిమా తర్వాత ఓ యంగ్ హీరోతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. వీరి కాంబోలో లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు తాజా సమాచారం. రీసెంట్గా సిద్దూ కి ఓ స్టోరీని నెరేట్ చేసి సిద్దూ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్లు నందినీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా మ్యాడ్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందని కూడా నందినీ చెప్పుకొచ్చింది. ఈ మూవీలో సమంత హీరోయిన్ అనే విషయాన్ని మాత్రం నందినీ ఎక్కడా చెప్పింది లేదు. కానీ నందినీకి, సమంతకు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ మూవీ సాధ్యపడే అవకాశాలున్నాయంటున్నారు అందరూ.
ఇప్పటికే వీరి కాంబోలో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు రాగా, ఇప్పుడు మరో సినిమా కోసం వీరిద్దరూ జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సిద్ధూ పక్కన సమంత అయితే బాగుంటుందని నందినీ అనుకుంటుందట. ఈ వార్తలు నిజమైతే ఈ ప్రాజెక్ట్ మంచి క్రేజీ ప్రాజెక్ట్ అవడం ఖాయం.













