బిజినెస్ రంగంలోకి దిగిన సమంత
తెలుగు తెరపై వెలుగొందుతోన్న కథానాయికలు, ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున సొంత వ్యాపారాలు ఆరంభించేస్తున్నారు. వరుస షూటింగుల్లో పాల్గొంటూనే వ్యాపార వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలా ఇప్పటికే తమన్నా జ్యూయలరీ బిజినెస్‌ను, రకుల్ జిమ్ బిజినెస్ ను స్టార్ చేశారు. తాజాగా ఈ జాబితాలో సమంత కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఒక వైపున సినిమాలు చేస్తూ, మరో వైపున చేనేత కార్మికులకు అండగా నిలబడుతోన్న సమంత, సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అలాంటి సమంత ఎస్.వి.ఎస్.పార్ట్ నర్స్ -ఎల్.ఎల్.సి పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ఈ సంస్థను స్థాపించడం తన కల అనీ, దీని ద్వారా తన కలను సాకారం చేసుకుంటానని చెప్పింది.













