రూట్ మారుస్తా అంటున్న సమంత
ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న సమంత, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, విదేశాల్లో టూర్లు ఎంజాయ్ చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. గ్యాప్ తీసుకున్న సమంత కెరీర్ ఇక పుంజుకోవడం ఖాయమంటున్నారు కొంతమంది. ఇదిలా ఉంటే ప్రెజెంట్ యూఎస్‌లో ఉన్న సమంత, ఇన్‌స్టా లో చిట్ చాట్ ద్వారా ఫ్యాన్స్ తో సంభాషించింది.
ఈ సందర్భంగా ఆమె ఖుషి తర్వాత మరే కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదని, ఇకపై తను రూట్ మార్చి కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇకపై కథల సెలెక్షన్లో జాగ్రత్తగా ఉంటూ, తనకు సెట్ అయ్యే క్యారెక్టర్లు మాత్రమే చేయాలనుకుంటున్నట్లు సమంత చెప్పింది. చికిత్సలో భాగంగా తను చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించింది సమంత.
అంతే కాదు ట్రీట్మెంట్లో చాలా రకాల స్టెరాయిడ్ వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడినట్లు, చిన్మయి మళ్లీ తనను గ్లాసీగా మారుస్తానని మాటిచ్చిందని సమంత చెప్పింది. తన నుంచి రాబోతున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో తన క్యారెక్టర్ ఫన్నీగా, హాట్ గా ఉంటుందని, ఆ క్యారెక్టర్ తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని సమంత చెప్పుకొచ్చింది.













