లాంగ్ బ్రేక్ తీసుకోనున్న సమంత.. కారణమేంటంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జాను సినిమా తర్వాత సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎంతోమంది డైరక్టర్లు ఆమెకు కథలు వినిపించినా, సమంత మాత్రం ఏ ఒక్కరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పదేళ్ల నుంచి ప్రతీ ఏడూ తన నుంచి సినిమాలొస్తూనే ఉన్నాయి. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. అయితే కెరీర్ స్టార్స్ చేసి పదేళ్లు పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనలో సామ్ ఉన్నట్లు తన సన్నిహితులు చెప్తున్నారు.
అయితే జాను ఫ్లాప్ తర్వాత సమంత ఏ సినిమాకు సైన్ చేయలేదు. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చే శాకుంతలం మూవీకి సమంత సైన్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన మూవీ సెట్ వర్క్ భారీగా జరుగుతుందట. మార్చి20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్ లో మొదలు కానుంది. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా తెరకెక్కతున్న ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత సమంత కొంచెం లాంగ్ బ్రేక్ తీసుకుని మళ్లీ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వస్తుందని చెప్తున్నారు. మరి ఈ లాంగ్ గ్యాప్ తీసుకోవాలనుకోవడానికి రీజన్ ఏంటో సమంతనే చెప్పాలి.













