సమంతకు హైకోర్టు అండ.. డీప్‌ఫేక్‌లకు చెక్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(samantha ruth prabhu) పేరును, ఫొటోలను, వాయిస్‌ను పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తున్న డిజిటల్ కంటెంట్‌పై బాంబే హైకోర్టు కీలకంగా రియాక్ట్ అయింది. తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందంటూ సమంత కోర్టును ఆశ్రయించగా, ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న అంశాలను ఆమె పిటిషన్లో ప్రస్తావించారు.
ఈ కేసు విచారణలో సమంత తరఫు న్యాయవాది ఆమె పేరుతో జరుగుతున్న పలు రకాల దుర్వినియోగాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, ఏఐ క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ వాయిస్ క్లిప్స్‌తో పాటు అభ్యంతరకరమైన కంటెంట్, సమంత పేరుతో రూపొందించిన ఇంటరాక్టివ్ ఏఐ చాట్బాట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలను పరిశీలించిన జస్టిస్ మాధవ్ జమ్దార్ ధర్మాసనం, ప్రాథమికంగా సమంత వ్యక్తిత్వ, ప్రచార, నైతిక హక్కులకు భంగం కలిగినట్లు కనిపిస్తోందని పేర్కొంది.
ఆర్టిస్టుగా సమంతకు ఉన్న హక్కులతో పాటు వ్యక్తిగత గోప్యత, గౌరవానికి సంబంధించిన అంశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 38బీ కింద నటిగా ఆమెకు ఉన్న నైతిక హక్కులకు కూడా సేఫ్టీ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ బ్రేక్ లో ఉన్న సమంత నెక్ట్స్ ఇయర్ తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, తన డిజిటల్ గుర్తింపును కాపాడుకునేందుకు ఆమె తీసుకున్న ఈ న్యాయపరమైన చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.








