సమంతకు ఆ ఛాన్స్.. నిజమేనా?
అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలతో సమంత ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అవేమీ సమంతకు బూస్టప్ ను ఇవ్వలేదు. శాకుంతలం సినిమా డిజాస్టర్‌గా మారగా, ఖుషి సినిమా మొదటి మూడు రోజుల తర్వాత ఫ్లాప్ గా నిలిచింది. ఇక సమంత చేతిలో ఉంది సిటాడెల్ వెబ్ సిరీస్ మాత్రమే. వరుణ్ ధావన్ కు జోడీగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్ మీద ప్రైమ్ వీడియో చాలా ఎక్కువ మొత్తంలోనే బడ్జెట్‌ను పెట్టింది. ఇదిలా ఉండగా తన అనారోగ్యం నుంచి కోలుకోను వెంటనే సమంత, ఫుల్ లెంగ్త్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేవలం బాలీవుడ్ ఆఫర్ మాత్రమే కాదు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం సమంతను వరించిందని ముంబై ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
విష్ణు వర్ధన్‌తో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ లో సల్మాన్ సరసన సమంత నటించనుందని టాక్. ఈ సినిమా కోసమే సల్మాన్ గుండు కొట్టించుకున్నాడని తెలుస్తోంది. మిలటరీ ఆఫీసర్‌గా చాలా పవర్ఫుల్ రోల్ లో సల్మాన్ ఈ మూవీలో కనిపించనున్నాడట. అయితే సమంతను ఈ సినిమాలో ఓకే చేశారా లేదా అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగితేనే కన్ఫర్మ్ అవుతుంది.
వరుస ఫ్లాపులతో ఉన్న సమంత మార్కెట్ ప్రస్తుతానికైతే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దానికి తోడు రీసెంట్గా వచ్చిన ఖుషి సినిమాలో సమంత లుక్స్ విషయంలో కూడా కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే తనను తాను మళ్లీ కొత్తగా మార్చుకునే పనిలో సమంత ఉందని తెలుస్తోంది. ఏదేమైనా బాలీవుడ్ కండల వీరుడు సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ సమంతను వరించిందంటే మాత్రం అమ్మడు ఆ సినిమా తర్వాత అక్కడ పాగా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.













