మరో పక్కా మాస్ సాంగ్ లో సమంత
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న సమంత ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకోవడానికి సమాయత్తమవుతోంది. హీరోయిన్గా మెప్పిస్తూ వచ్చిన సామ్… ఎవరూ ఊహించని రీతిలో ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అదరగొట్టేసింది. అయితే త్వరలోనే పుష్పలోని మాస్ సాంగ్‌ను మించిపోయే మాస్ సాంగ్‌తో సమంత మెప్పించనుందనే వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. కేవలం ఆ పాట కోసమే ఆమెకు భారీ మొత్తాన్ని నిర్మాతలు ఇచ్చారు. కాగా.. పుష్ప సినిమా తర్వాత మరో సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‌లో నటించలేదు. అయితే త్వరలోనే పుష్పలోని మాస్ సాంగ్‌ను మించిపోయే మాస్ సాంగ్‌తో సమంత మెప్పించనుందనే వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. సమంత తాజా చిత్రం యశోద. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పక్కా మాస్ సాంగ్. ఈ పాటలో మరొకరిని నటింప చేస్తే ఏం బావుంటుందని సమంత భావించిందేమో ఏమో.. సదరు మాస్ సాంగ్‌లో స్టెప్పులేయడానికి సమంత ఒకే చెప్పేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయబోతున్నారు మేకర్స్. హరి హరీష్ అనే దర్శక ద్వయం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత డ్రీమ్ వారియర్ పిక్చర్స్లోనూ సమంత ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పింది.













